బన్నీ సాంగ్ లో లిండో డ్యాన్సర్స్ 

బన్నీ సాంగ్ లో లిండో డ్యాన్సర్స్ 

అల్లు అర్జున్ కొత్త సినిమా అల వైకుంఠపురంలో మూవీ షూటింగ్ ప్రస్తుతం ప్యారిస్ లో జరుగుతున్నది.  ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయినట్టు సమాచారం.  ఇందులోని సామజవరగమన సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు.  లిరికల్ సాంగ్ గా రిలీజ్ చేసిన ఈ సాంగ్ యూట్యూబ్ లో తెలుగు సినిమా సాంగ్ కు అత్యధిక లైక్ లు వచ్చిన సాంగ్ గా రికార్డు కెక్కింది.  

ఈ సాంగ్ ను ప్యారిస్ లో షూట్ చేస్తున్నారు.  ఈ సాంగ్ కోసం ప్యారిస్ లోనే ది బెస్ట్ డ్యాన్స్ గా చెప్పుకొనే లిండో డ్యాన్సర్లు సమక్షంలో ఈ సాంగ్ ను షూట్ చేస్తున్నారు  లిరికల్ వీడియో ఎంతటి హిట్ అయ్యిందో.. వీడియో సాంగ్ కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని యూనిట్ భావిస్తోంది.  పూజా హెగ్డే హీరోయిన్.  కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.