అనిల్ రావిపూడికి లైన్ క్లియర్ అయినట్లే !

అనిల్ రావిపూడికి లైన్ క్లియర్ అయినట్లే !

'పటాస్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2' లాంటి వరుస హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి.  ఇతని వర్క్ నచ్చి సూపర్ సార్ మహేష్ బాబు అతనితో సినిమా చేయాలని అనుకున్నాడు.  ఆ విషయాన్ని రావిపూడి కూడా చెప్పాడు.  దీంతో మహేష్ కోసం కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడు రావిపూడి.  కానీ  మహేష్ బాబుకు వరుస కమిట్మెంట్స్ ఉండటం వలన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడప్ప్పుడే పట్టాలెక్కదని అనుకున్నారు. 

కానీ సుకుమార్ తో మహేష్ చేద్దామనుకున్న సినిమా కొన్ని కారణాల వలన ఆగిపోయింది.  దీంతో మహేష్ తర్వాతి జాబితాలో సందీప్ వంగ తప్ప మరెవరూ లేరు.  కాబట్టి అనిల్ రావిపూడి సినిమాకు లైన్ క్లియర్ అయినట్లేనని చెప్పొచ్చు.  పైగా సందీప్ 'కబీర్ సింగ్' పనుల్లో ఉన్నాడు కాబట్టి అది పూర్తయ్యేలోపు మహేష్ అనిల్ సినిమాను మొదలుపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు.