బాలయ్య.. బోయపాటి మూవీ సెట్టయినట్టే..

బాలయ్య.. బోయపాటి మూవీ సెట్టయినట్టే..

ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలకృష్ణ... మొదట బోయపాటితో సినిమా చేస్తున్నారనే వార్తలు వచ్చాయి.  అయితే, బడ్జెట్ ఇష్యూస్ వలన సినిమా పోస్ట్ ఫోన్ అయింది.  కథ బాగున్నప్పటికీ... బడ్జెట్ రూ. 70 కోట్ల రూపాయల వరకు ఉండటంతో ఎక్కువగా ఉందని, తగ్గించాలని బాలకృష్ణ చెప్పారట.  దానికోసమే సినిమా పోస్ట్ ఫోన్ అయింది.  

ఈలోపు బాలకృష్ణ మరో దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా లైన్లోకి వచ్చింది.  మరో వారం రోజుల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  ఈలోపు బాలయ్య అభిమానులకు మరో తీపి కబురు అందింది.  బాలకృష్ణ ... బోయపాటి సినిమాకు లైన్ క్లియర్ అయినట్టు సమాచారం.  ఆగష్టు చివరి వారం నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది.  కెఎస్ రవికుమార్, బోయపాటి సినిమాలను బాలయ్య వరసగా చేస్తున్నారట.