టీచర్ల బదిలీలకు లైన్ క్లియర్...

టీచర్ల బదిలీలకు లైన్ క్లియర్...

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులకు లైన్ క్లియర్ అయ్యింది... తుది తీర్పు ఇచ్చే వరకు బదిలీ ఆర్డర్స్ ఇవ్వొద్దని హై కోర్టు ఆదేశించింది. బదిలీలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వేసిన అన్ని పిటిసన్లను కొట్టివేసిన హైకోర్టు... బదిలీ ఆర్డర్ ని ఉమ్మడి జిల్లా డీఈవోలు కాకుండా ఆర్‌జేడీలు ఇవ్వాలని ఆదేశించింది. కాగా, ఉపాధ్యాయుల బదిలీలు ఆపాలంటూ న్యాయస్థానంలో మొత్తం 125 పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు... ఆ పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.