ఆయన వల్లే పార్టీ మారాను: లింగయ్య

ఆయన వల్లే పార్టీ మారాను: లింగయ్య

'ఎన్నికల్లో నా నియోజకవర్గ ప్రజలకు చాలా హామీలిచ్చాను. వాటిని నెరవేర్చాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీయే సరైనది' అని అన్నారు నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ ఎవరి ప్రోద్బలంతో తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. తాను పార్టీ మారడానికి ప్రధాన కారణం పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ విధానాలు నచ్చకనే అని అన్నారాయన. 

కాంగ్రెస్‌లో దళిత నేతలకు గౌరవం లేదన్న ఆయన.. ఉత్తమ్‌ను ఓ సైకోగా అభివర్ణించారు. ఉత్తమ్ తీరుతో గాంధీ భవన్‌కు వచ్చే వారే కరువయ్యారని అన్నారు లింగయ్య. రాహుల్ గాంధీ సభకు 10 వేల మంది కూడా రాలేదంటే ఉత్తమ్‌ పనితీరును అర్ధం చేసుకోవచ్చని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా తనకు చాలా సహకరించారని.. వారు టీఆర్‌ఎస్‌లోకి వస్తారో రారో తనకు తెలియదని అన్నారు.