బీజేపీలో విషాదం.. లింగోజిగూడ కార్పొరేటర్ మృతి..

బీజేపీలో విషాదం.. లింగోజిగూడ కార్పొరేటర్ మృతి..

బీజేపీ శ్రేణుల్లో న్యూఇయర్ సమీపిస్తున్న సమయంలో విషాదం చోటుచేసుకుంది.. లింగోజిగూడ కార్పొరేటర్‌ రమేష్‌ గౌడ్‌ కన్నుమూశారు... తాజాగా జరిగిన టర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆకుల రమేష్ గౌడ్‌.. తన సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్‌ నేత ముద్రబోయిన శ్రీనివాసరావుపై 2811 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే, విజయం సాధించిన మూడు రోజులకే ఆయన కరోనాబారినపడ్డారు... ఆ తర్వాత గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చేరిన రమేష్ గౌడ్. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు.. ఇక, బీజేపీలో కీలక నేతగా ఉన్నారు రమేష్‌గౌడ్... గతంలో ఎల్బీనగర్‌ మున్సిపల్ చైర్మన్‌గా కూడా ఆయన పనిచేవారు.. గ్రేటర్ ఎన్నికల్లో ఆయన విజయం సాధించినా.. కనీసం ప్రమాణస్వీకారం కూడా చేయకుండానే కన్నుమూయడం విషాదంగా మారింది.. కాగా, గ్రేటర్ ఎన్నికల్లో ఎల్బీ నగర్‌ నియోజకవర్గంలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఇక, రమేష్‌ గౌడ్‌ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... రమేష్‌గౌడ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.