భారత పైలెట్ మృతదేహం లభ్యం

భారత పైలెట్ మృతదేహం లభ్యం

గతనెల 29న ఇండొనేషియాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన భారత పైలెట్ భవ్యే సునేజా మృత దేహం లభించింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విటర్ ద్వారా తెలిపారు. అక్కడి అధికారులు పైలెట్ మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అందచేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. భవ్వే సునేజా మరణంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. గత నెలలో జకార్తా నుంచి బ్యాంగ్ కా ద్వీపానికి వెళుతున్న లయన్ ఎయిర్ కు చెందిన విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 189 మంది ప్రయాణికులు మరణించగా, ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల భవ్యే సునేజా విమాన పైలెట్ గా వ్యవహరించారు.