అర్జెంటీనా ఓటమి.. మెస్సీ అభిమాని మృతి

అర్జెంటీనా ఓటమి.. మెస్సీ అభిమాని మృతి

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ ఆటగాడు లియోనల్‌ మెస్సీ వీరాభిమాని డీనూ అలెక్స్‌(30) మిస్సింగ్‌ కేసును ఛేదించారు పోలీసులు. ఫిఫా వరల్డ్‌ కప్‌లో భాగంగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 3-0తో  క్రొయేషియా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని కేరళ కొట్టాయంకు చెందిన అలెక్స్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్జెంటీనా జట్టు ఓటమి తర్వాత సూసైడ్‌ నోట్‌ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయి కొట్టాయంకు సమీపంలో ఉన్న మీనాచి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పోలీసులు ఆదివారం ఉదయం డీనూ అలెక్స్‌ మృతదేహాన్ని నదిలో గుర్తించారు.

గ్రూప్ దశలో భాగంగా జరిగిన మ్యాచ్ లో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు క్రొయేషియా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమిని కళ్లారా చూసిన లియోనల్‌ మెస్సీ వీరాభిమాని డీనూ అలెక్స్‌ ఆవేశంలో ఒక సూసైడ్‌ నోట్‌ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 'ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నా.. ఇక నేను చూడటానికి ఏమీలేదు' అని లేఖలో రాసాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మీనాచి నదిలో మృతదేహం లభించింది. ఈ ఘటనతో డీనూ అలెక్స్‌ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 

Photo: FileShot