ఇవాళ మద్యం షాపులు బంద్..

ఇవాళ మద్యం షాపులు బంద్..

ఇవాళ మద్యం షాపులు తెరచుకోవు.. శ్రీరామనవమి సందర్భంగా గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మద్యం షాపులు మూసివేయాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌తోపాటు, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని వైన్స్‌లు, కల్లు దుకాణాలు, బార్లను ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మూసి ఉంచుతారు. శ్రీరామనవమి సందర్భంగా భారీఎత్తున హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో ఊరేగింపు కూడా జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.