మూడు రోజులు మద్యం షాపులు బంద్..

మూడు రోజులు మద్యం షాపులు బంద్..

మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. మరో మూడు రోజుల పాటు వైన్‌షాపులు, బార్లు మూతపడనున్నాయి... అంతేకాదు.. కల్లు ప్రేమికులకు కూడా చేదు వార్త.. కల్లు డిపోలు కూడా మూడు రోజులు క్లోజ్ కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జంట నగరాల్లో (హైదరాబాద్‌, సికింద్రాబాద్‌) పరిధిలో ఈనెల 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్‌ షాపులు, కల్లు డిపోలు, బార్లు మూసివేయాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.