ప్రముఖ సాహితీవేత్త నిర్మలానంద కన్నుమూత

హిందీ సహా పలు భారతీయ భాషల్లోని కథలను తెలుగులోకి అనువదించిన ప్రముఖ సాహితీవేత్త నిర్మలానంద (ముప్పన మల్లేశ్వరరావు, 84) మంగళవారం కన్నుమూశారు. 35 ఏళ్లుగా జనసాహితి సాహిత్యోద్యమంలో నిర్మలానంద కీలకపాత్ర పోషించారు. తెలుగులోని పలువురు ప్రముఖ సాహితీవేత్తల సాహిత్యాన్ని ఆయన హిందీలోకి అనువదించారు. అలాగే మహాకవి శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానాన్ని నిర్మలానంద హిందీలోకి అనువదించారు. రేపు(బుధవారం) ఉదయం 11.30గంటలకు హైదరాబాద్‌లో నిర్మలానంద అంత్యక్రియలు జరుగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిర్మలానంద మృతి పట్ల జనసాహితి నేతలు కొత్తపల్లి రవిబాబు, దివికుమార్, అరుణ, ప్రముఖ సాహితీవేత్త నిఖిలేశ్వర్ సంతాపం ప్రకటించారు.