కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మళ్లీ ఆ బాలుడే హైలైట్...

కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మళ్లీ ఆ బాలుడే హైలైట్...

ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్... రాంలీలా మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.. మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేయగా.. ఆ తర్వాత మంత్రులు ప్రమాణం చేశారు. ఇక, ఈ కార్యక్రమంలో ఓ బాలుడు హైలైట్‌గా నిలిచాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు కేజ్రీవాల్ తరహాలో క్యాప్, మఫ్లర్ ధరించి, కళ్ల జోడు పెట్టుకుని, చిన్న మీసం తగిలించిన ఓ బాలుడు.. అందరినీ ఆకట్టుకున్నాడు.. ఇక, ఆప్ ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్లినట్టుగానే.. ఆ బాలుడు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఫిబ్రవరి 11వ తేదీన అసెంబ్లీ ఫలితాల రోజు అందరినీ ఆకర్షించిన ఆ బాలుడిని ప్రత్యేకంగా ఆహ్వానించింది ఆమ్ ఆద్మీ పార్టీ... దీంతో... ఇవాళ ప్రమాణస్వీకారోత్సవ వేదిక దగ్గర కూడా ఆ బాలుడు.. కేజ్రీవాల్‌గా... క్రేజీ... క్రేజీ.. పోజులు ఇస్తూ అందరినీ మరోసారి ఆకట్టుకున్నాడు..