పట్టపగలే దారుణ హత్య..

పట్టపగలే దారుణ హత్య..

పట్టపగలే నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణహత్యకు గురికావడం కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలో జాతీయ రహదారి 65పై కాసేపటి క్రితమే ఈ హత్య జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడు మహబూబ్ గా గుర్తించారు. నిందితుడు మహమూద్‌గా నిర్ధారించారు. మహమూద్‌.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ అంటున్నారు పోలీసులు. ఇతనికి పలు హత్య కేసులతో సంబంధం ఉందంటున్నారు. గతంలో లక్డారం దగ్గర జరిగిన ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు పోలీసులు. కాగా, నడిరోడ్డుపై వేటకొడవలితో నరికి చంపుతున్నా ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.. స్థానికులు భయాందోళనకు గురికాగా.. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేశారు. తన కసిరీత నరికిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.