ఆ ప్రాంతాల్లో 'స్థానిక' పోలింగ్ సమయం కుదింపు

ఆ ప్రాంతాల్లో 'స్థానిక' పోలింగ్ సమయం కుదింపు

తెలంగాణలోని నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ సమయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కుదించింది. భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, కొమరం భీం అసిఫాబాద్ జిల్లాల్లో ఉదయం 7గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పోలింగ్ సిబ్బంది, సామాగ్రి తరలింపులో ఇబ్బందులు రాకుండా సమయాన్ని కుదించమని రాష్ట్ర ఎన్నికల సంఘానికి డీజీపీ లేఖ రాశారు. దీంతో సమాయాన్ని కుదిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మార్పులను సూచిస్తూ ఆయా జిల్లా కలెక్టర్ల లేఖల ద్వారా సమాచారం అందించారు. అలాగే పోలింగ్ సమయంపై అభ్యర్ధులకు, ఓటర్లకు అవగాహన కల్పించాలని ఎన్నికల సంఘం సూచించింది.