పరిషత్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం

పరిషత్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం

రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి అన్నారు. తక్కువ సమయంలోనే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన అందరికీ నాగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రతా బలగాలను మోహరించినట్లు తెలిపారు. ఈనెల 27న కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. 123 ప్రాంతాల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా కౌంటింగ్ జరుగుతుందని.. ఒక్కో ఎంపీటీసీకి రెండు కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పుడున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవి కాలం జులై 3 వరకు ఉందని తెలిపారు. కొత్తగా ఎన్నికైన వారు 4 జులై నుంచి అధికారంలోకి వస్తారని అన్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే మున్సిపల్ ఎన్నికలను కూడా సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు.