ఈ నెల 31 వరకు తిరుపతిలో లాక్ డౌన్

ఈ నెల 31 వరకు తిరుపతిలో లాక్ డౌన్

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో..  చిత్తూర్ జిల్లా తిరుపతిలో ఆగష్టు 31 వరకు లాక్ డౌన్ విధిస్తునట్లు అధికారులు ప్రకటించారు. శనివారం అధికంగా 959 పాజిటివ్ కేసులు.. 10 మరణాలు సంభవించాయి. దీంతో లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  అయితే, లాక్ డౌన్ అంక్షల్లో కొన్ని సడలింపులు ఇచ్చిన అధికారులు ఉదయం  6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు షాపులు తెరుచుకోనేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీశ ఆదేశాలు జారీ చేసారు.