తిరుపతిలో నేటి నుండి రెండు వారాల లాక్ డౌన్
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం రోజున ఉదయం 11 గంటల వరకే షాపులు తెరిచారు. ఉదయం 11 తరువాత నగరంలోని అన్ని షాపులను మూసెయ్యడంతో జనసంచారం కొంతమేర తగ్గింది. దీంతో ఇదే విధమైన ఆంక్షలను ఆగష్టు 5 వరకు అమలు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.
ఆగష్టు 5 వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంటాయని కలెక్టర్ తెలిపారు. మద్యం షాపులు సైతం ఉదయం 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని అన్నారు. మరోవైపు తిరుమల దర్శనాలకు వెళ్లే వాహనాలకు నగరంలోని బైపాస్ రోడ్డు నుంచి పోలీసులు అనుమతిని ఇస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)