రహానేకు స్టేడియంలోకి నో ఎంట్రీ..!

రహానేకు స్టేడియంలోకి నో ఎంట్రీ..!

అజింక్యా రహానేకు బ్యాడ్‌ టైమ్‌ కొనసాగుతోంది. రాజస్థాన్‌ రాయల్స్‌  కెప్టెన్‌ అయిన రాహానేను సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలోకి రాకుండా అక్కడి సిబ్బంది అడ్డు కున్నారు. ప్రాక్టీ స్‌ కోసం స్టేడియానికి వచ్చిన రహానేతోపాటు మరికొంత మంది ఆటగాళ్లను దాదాపు అరగంటాపాటు లోపలకు వెళ్లనీయకుండా ఆపేశారు. రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌-రాష్ట్ర స్పోర్ట్స్‌ కౌన్సిల్‌తో ఉన్న వివాదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. స్టేడియం నిర్వహణ కింద స్పోర్ట్స్‌ కౌన్సిల్‌కు కట్టాల్సిన మొత్తాన్ని ఆర్‌ఆర్‌ ఫ్రాంచైజీ చెల్లించలేదని తెలుస్తోంది. ఐతే.. భద్రతా కారణాల వల్లే ఆటగాళ్లను ఆగమన్నామని అధికారులు చెబుతుండడం కొసమెరుపు