2000 కిలోల లడ్డూల తయారీకి ఆర్డరిచ్చిన బీజేపీ అభ్యర్థి

2000 కిలోల లడ్డూల తయారీకి ఆర్డరిచ్చిన బీజేపీ అభ్యర్థి

లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది. కానీ ముంబైలో ఇప్పటి నుంచే వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని బోరీవలీ ప్రాంతంలోని ఒక మిఠాయి దుకాణం ఉత్తర ముంబై బీజేపీ అభ్యర్థి గోపాల్ షెట్టి కోసం మిఠాయిలు తయారు చేస్తోంది. విశేషమేంటంటే ఇక్కడ పనిచేసే వాళ్లంతా మోడీ మాస్కులు తగిలించుకొని మిఠాయిలు తయారుచేస్తున్నారు.

'మే 23కి 1500-2000 కిలోల మిఠాయిలు తయారు చేయాల్సిందిగా ప్రస్తుత ఎంపీ, ఉత్తర ముంబై బీజేపీ అభ్యర్థి గోపాల్ షెట్టి మాకు ఆర్డర్ ఇచ్చారు. ఆయన గెలుపుపై మాకు కూడా చాలా అంచనాలు ఉన్నాయి. అందుకని మా వర్కర్స్ అంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాస్కులు పెట్టుకొని మిఠాయిలు తయారుచేస్తున్నారని' దుకాణదారుడు చెప్పారు.

ఉత్తర ముంబై సీటులో గోపాల్ షెట్టి కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటి ఊర్మిళా మాతోండ్కర్ తో తలపడుతున్నారు. చాలా ఎగ్జిట్ పోల్స్ షెట్టి విజయం ఖాయమని చెప్పాయి. దీంతో ఇక్కడ కమలం పార్టీ కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు. అందుకని గోపాల్ షెట్టి వేడుకలకు సన్నాహాలు ప్రారంభించారు. ఇంతకు ముందు 2014లో షెట్టి కాంగ్రెస్ దిగ్గజ నేత సంజయ్ నిరుపమ్ ను ఓడించారు.