ప్రశాంతంగా ముగిసిన ఆరో విడత పోలింగ్

ప్రశాంతంగా ముగిసిన ఆరో విడత పోలింగ్

సార్వత్రిక ఎన్నికల ఆరోవిడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు ఆదివారం పోలింగ్‌ నిర్వహించారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు అసౌకర్యానికి గురయ్యారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ 53.25 శాతంగా నమోదైంది. బీహార్ 48.67, హర్యానా 55.99, మధ్యప్రదేశ్ 55.41, ఉత్తర ప్రదేశ్ 45.81, పశ్చిమ బెంగాల్ 71.76, జార్ఖండ్ 58.32, ఢిల్లీ 45.79 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఆరో విడతలో భాగంగా బీహార్‌లోని 8, ఢిల్లీలోని 7, హర్యాణాలోని 10, జార్ఖండ్‌లోని 4, మధ్యప్రదేశ్‌లోని 8, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 14, పశ్చిమ బెంగాల్‌లోని 8 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆరోదశ పోలింగ్‌తో కలిపి ఇప్పటి వరకు మొత్తం 483 నియోజకవర్గాలకు పోలింగ్‌ ముగిసింది. మిగిలిన 59 స్థానాలకు చివరి దశలో మే నెల 19న పోలింగ్‌ నిర్వహిస్తారు.