నేడే తుది విడత పోలింగ్..

నేడే తుది విడత పోలింగ్..

సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే ఆరు విడతలుగా పోలింగ్ నిర్వహించగా... ఇవాళ తుది ఘట్టమైన ఏడో విడతల పోలింగ్ జరగనుంది. ఏడో విడతలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటీచేస్తున్న వారణాసి సహా దేశంలోని 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన ఛండీగఢ్‌లలో విస్తరించిన 59 నియోజకవర్గాల్లోని పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ 59 నియోజకవర్గాల నుంచి 918 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక గత అనుభవాల దృష్ట్యా పశ్చిమబెంగాల్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అదనపు బలగాలను మోహరించారు. ఇవాళ పోలింగ్ ముగిస్తే... దేశంలోని 542 నియోజకవర్గాలకు పోలింగ్‌ ముగుస్తుంది. 

ఏడో దశ పోలింగ్ నిర్వహిస్తున్న నియోజకర్గాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం. పోలింగ్‌ జరిగే రాష్ట్రాలు  7, కేంద్రపాలిత ప్రాంతం 1, నియోజకవర్గాల సంఖ్య  59, ఓటర్ల సంఖ్య 10,01,75,153, వీరిలో పురుషులు 5,27,14,890, స్త్రీలు 4,74,56,828, ఇతరులు3,435.. తుది దశ ఎన్నికల్లో పోలింగ్‌ కోసం 1,12,993 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు. పోటీలో ఉన్న అభ్యర్థులు 918 మంది.