రెండో దశలో 5 గంటలకు 61.12 శాతం ఓటింగ్

రెండో దశలో 5 గంటలకు 61.12 శాతం ఓటింగ్

ఇవాళ రెండో దశ పోలింగ్ లో మొత్తం 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని 38 సీట్లు, కర్ణాటకలో 14 స్థానాలు, మహారాష్ట్రలో 10 నియోజకవర్గాలు, ఉత్తరప్రదేశ్ లో 8, అస్సామ్, బీహార్, ఒడిషాలలో చెరో 5, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ లో 3 చొప్పున, జమ్ముకశ్మీర్ లో రెండు, మణిపూర్, పుదుచ్చేరీలలో చెరో సీటుకి ఓటింగ్ జరుగుతోంది. రెండో దశ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు మొత్తంగా 61.12 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పటి వరకు కర్ణాటకలో 61.84 శాతం ఓట్లు పోలయ్యాయి. తమిళనాడులో ఇది 63.73 శాతంగా ఉంది. మణిపూర్ లో అత్యధికంగా 74.69 శాతం పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు తెలిసిన వివరాల ప్రకారం ఆస్సామ్ లో 73.32 శాతం, ఒడిషాలో 57.41 శాతం ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో తుది వివరాలు ప్రకటించే సమయానికి 58.12 శాతం ఓటింగ్ నమోదైంది. బీహార్ లో 58.14 శాతం, ఛత్తీస్ గఢ్ లో 68.70 శాతం, జమ్ముకశ్మీర్ లో 43.37 శాతం, మహారాష్ట్రలో 55.37 శాతం, పుదుచ్చేరిలో 72.40 శాతం, పశ్చిమ బెంగాల్ లో 75.27 శాతం పోలింగ్ జరిగింది. 

ఉత్తర బెంగాల్ లోని ఇస్లామ్ పూర్ లో సీపీఎం అభ్యర్థి మహ్మద్ సలీమ్ వాహనంపై కొందరు దుండగులు దాడి చేశారు. తమిళనాడు, బీహార్ లలోని పలు బూత్ లలో సాంకేతిక కారణాల వల్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.