జ్యోతిరాదిత్య సింధియా ఓటమి

జ్యోతిరాదిత్య సింధియా ఓటమి

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అత్యధిక మెజారిటీతో తిరిగి అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తుఫానులో దిగ్గజ ప్రతిపక్ష నేతల కంచుకోటలు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ యువ నేత జ్యోతిరాదిత్య సింధియా లక్ష ఓట్ల పై చిలుకు తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి కృష్ణపాల్ సింగ్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కృష్ణపాల్ కి 4,86,369 ఓట్లు రాగా జ్యోతిరాదిత్యకు 3,76,396 ఓట్లు మాత్రమే వచ్చాయి.

మధ్యప్రదేశ్‌ లోని గుణ, గ్వాలియర్ లోక్ సభ నియోజకవర్గాల రాజకీయం సింధియా రాజవంశం చుట్టూనే తిరుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు రాజమాత విజయరాజె సింధియా, ఆమె కుమారుడు మాధవరావ్ సింధియా, ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా ఈ రాజకీయాలకు కేంద్రంగా ఉంటూ వచ్చాయి. ఇన్నాళ్లూ సింధియా కుటుంబానికి పోటీ ఇచ్చేవారెవరూ దరిదాపుల్లో ఉండబోరని భావిస్తూ వచ్చారు. సింధియాల రాజకీయ ఆరంగేట్రం గుణ నుంచే ప్రారంభమైంది. గత నాలుగు ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సింధియాలే విజయం సాధించారు. మూడు తరాలుగా గుణలో ఈ సారి రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. బీజేపీ అభ్యర్థి కృష్ణపాల్ సింగ్ జ్యోతిరాదిత్య సింధియాను ఓడించి చరిత్ర సృష్టించారు.