మధ్యప్రదేశ్ లో హస్తం చిత్తు

మధ్యప్రదేశ్ లో హస్తం చిత్తు

గత ఏడాది చివరలో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్, లోక్ సభ ఎన్నికల్లో ఆ పట్టు నిలుపుకోలేకపోయింది. 230 సభ్యుల అసెంబ్లీలో బీజేపీ స్వల్ప తేడాతో అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకొంది. రెండు సీట్లు గెలిచిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ లోక్ సభ ఎన్నికల్లో అంతా తారుమారైంది. 29 పార్లమెంట్ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ లో ఎక్కడా హస్తం పార్టీ బీజేపీకి గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. గత ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి జ్యోతిరాదిత్య సింధియా ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ సీటును కూడా బీజేపీకి కోల్పోయింది. దీంతో కమలం పార్టీ 28 స్థానాల్లో తిరుగులేని విజయం సాధించింది. మిగిలిన ఒకేఒక్క స్థానం మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో పడింది.