రాజస్థాన్ లో కమల వికాసం

రాజస్థాన్ లో కమల వికాసం

ఇటీవలే జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి గద్దెనెక్కిన కాంగ్రెస్, లోక్ సభ ఎన్నికల్లో మాత్రం జావగారిపోయింది. 200 సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ 99 సీట్లు గెలిచింది. ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) నెగ్గిన ఒక సీటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 100ని చేరుకోగలిగింది. కానీ లోక్ సభ ఎన్నికల్లో మోడీ వేవ్ లో హస్తం అడ్రస్ గల్లంతైంది. రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంట్ స్థానాలను కమల దళం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన హేమాహేమీలంతా మట్టి కరిచారు. కాషాయ పార్టీ రాష్ట్రంలో వరుసగా రెండోసారి క్లీన్ స్వీప్ చేసి తన సంస్థాగత బలం సత్తాని చాటుకొంది.