బీజేపీ అభ్యర్థి కారు నుంచి నగదు స్వాధీనం

బీజేపీ అభ్యర్థి కారు నుంచి నగదు స్వాధీనం

గురువారం ఒడిషాలోని ఢెంకనాల్ జిల్లాలో బీజేపీ అభ్యర్థి వాహనం నుంచి రూ. 4 లక్షల నగదును నిఘా స్క్వాడ్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. హిందోల్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్న అశోక్ నాయక్ ఆ నగదు ఎక్కడి నుంచి తెస్తున్నారనే ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు ఇవ్వకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఢెంకనాల్ ఎస్పీ అనుపమ జేమ్స్ తెలిపారు. భాపూర్-ఢెంకనాల్ రోడ్డులో  మంగల్ పూర్ ఛక్ దగ్గర ఒడిషా పోలీసులకు చెందిన ప్రత్యేక బృందం కారును ఆపి సోదాలు చేసింది. నాయక్ ను ఢెంకనాల్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రశ్నిస్తున్నట్టు ఎస్పీ చెప్పారు. మూడో దశలో ఏప్రిల్ 23న జిల్లాలోని లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.