రేపు నాలుగో దశ పోలింగ్

రేపు నాలుగో దశ పోలింగ్

సోమవారం జరగనున్న నాలుగో విడత పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 9 రాష్ట్రాల్లో జరగనున్న ఈ పోలింగ్ లో 12.79 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందు కోసం లక్షా 40 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర (17), ఉత్తరప్రదేశ్ (13), రాజస్థాన్ (13), పశ్చిమ బెంగాల్ (8), మధ్యప్రదేశ్ (6), ఒడిశా (6), బీహార్ (5), ఝార్ఖండ్ (3), జమ్మూకాశ్మీర్ (1) రాష్ట్రాల్లో మొత్తం 72 నియోజకవర్గాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 961 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నాలుగవ విడత ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసింది.

బీహార్
5: ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాల సంఖ్య
66: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల సంఖ్య
8,834: మొత్తం పోలింగ్ బూతుల సంఖ్య
87,02,313: మొత్తం ఓటర్ల సంఖ్య 
46,35,071: పురుష ఓటర్ల సంఖ్య
40,67,009: స్త్రీ ఓటర్ల సంఖ్య
233: థర్డ్ జెండర్ల సంఖ్య

జమ్ము అండ్ కాశ్మీర్ 
1: ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాల సంఖ్య
18: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల సంఖ్య
433: మొత్తం పోలింగ్ బూతుల సంఖ్య
3,44,224: మొత్తం ఓటర్ల సంఖ్య 
1,79,607: పురుష ఓటర్ల సంఖ్య
1,64,604: స్త్రీ ఓటర్ల సంఖ్య
13: థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య

జార్ఖండ్ 
3: ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాల సంఖ్య
59: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల సంఖ్య
3,013: మొత్తం పోలింగ్ బూతుల సంఖ్య
45,26,693: మొత్తం ఓటర్ల సంఖ్య 
23,85,932: పురుష ఓటర్ల సంఖ్య
21,40,750: స్త్రీ ఓటర్ల సంఖ్య
11:  థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య

మధ్యప్రదేశ్
6: ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాల సంఖ్య
108: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల సంఖ్య
13,491: మొత్తం పోలింగ్ బూతుల సంఖ్య
1,05,55,689: మొత్తం ఓటర్ల సంఖ్య 
53,99,760: పురుష ఓటర్ల సంఖ్య
51,55,751: స్త్రీ ఓటర్ల సంఖ్య
178: థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య

మహారాష్ట్ర
17: ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాల సంఖ్య
323: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల సంఖ్య
33,314:  మొత్తం పోలింగ్ బూతుల సంఖ్య
3,11,92,823: మొత్తం ఓటర్ల సంఖ్య 
1,66,31,707: పురుష ఓటర్ల సంఖ్య
1,45,59,698: స్త్రీ ఓటర్ల సంఖ్య
1418: థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య

ఒడిషా
6: ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాల సంఖ్య
52: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల సంఖ్య
10,792: మొత్తం పోలింగ్ బూతుల సంఖ్య
95,14,883: మొత్తం ఓటర్ల సంఖ్య 
49,08,575: పురుష ఓటర్ల సంఖ్య
46,05,694: స్త్రీ ఓటర్ల సంఖ్య
615: థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య

రాజస్థాన్
13: ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాల సంఖ్య
115: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల సంఖ్య
28,182: మొత్తం పోలింగ్ బూతుల సంఖ్య
2,57,76,993: మొత్తం ఓటర్ల సంఖ్య 
1,33,00,801: పురుష ఓటర్ల సంఖ్య
1,24,76,052: స్త్రీ ఓటర్ల సంఖ్య
140: థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య

ఉత్తరప్రదేశ్‌
13: ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాల సంఖ్య
152: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల సంఖ్య
27,513: మొత్తం పోలింగ్ బూతుల సంఖ్య
2,38,88,367: మొత్తం ఓటర్ల సంఖ్య 
1,29,75,125: పురుష ఓటర్ల సంఖ్య
1,09,12,012: స్త్రీ ఓటర్ల సంఖ్య
1230: థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య

పశ్చిమ బెంగాల్
8: ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాల సంఖ్య
68: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల సంఖ్య
15,277: మొత్తం పోలింగ్ బూతుల సంఖ్య
1,34,56,491: మొత్తం ఓటర్ల సంఖ్య 
69,06,199: పురుష ఓటర్ల సంఖ్య
65,50,004: స్త్రీ ఓటర్ల సంఖ్య
288: థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య