రాష్ట్రంలో 12 చోట్ల రీపోలింగ్ నిర్వహించండి

రాష్ట్రంలో 12 చోట్ల రీపోలింగ్ నిర్వహించండి

ఒడిషా బ్రహ్మగిరి నియోజకవర్గంలోని 62వ పోలింగ్‌ బూత్‌తో పాటు రాష్ట్రంలో 12 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఒడిశా రాష్ట్ర సీఈవో సురేంద్రకుమార్‌ సిఫార్సు చేశారు. బ్రహ్మగిరి నియోజక వర్గంలోని 62వ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం కంట్రోల్‌ యూనిట్ తారుమారయ్యాయని తెలిపారు. స్ట్రాంగ్‌రూం నుంచి సిబ్బంది ఈవీఎంలను తీసుకున్నప్పుడే ఈ పొరపాటు జరిగిందని సీఈసీ దృష్టికి తీసుకువచ్చారు. అందువల్ల అక్కడ రీపోలింగ్‌ నిర్వహించాలని సూచించారు. దీంతో పాటు మూడో దశ పోలింగ్‌ సందర్భంగా రాష్ట్రంలో 12 చోట్ల ఇబ్బందులు తలెత్తాయని, దీంతో అక్కడ కూడా రీపోలింగ్‌ నిర్వహించాలని తెలుపుతూ ఒడిషా సీఈఓ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.