రైతుబంధును కేంద్రం కాపీ కొట్టింది: నామా

రైతుబంధును కేంద్రం కాపీ కొట్టింది: నామా

తెలంగాణ సీఎం కేసీఆర్ కు దేశం మీద కూడా అవగాహన ఉంది. తెలంగాణలోని పథకాలు దేశ వ్యాప్తంగా కాపీ కొడుతున్నారు. రైతుబంధు పథకం తెలంగాణలో మొదలు పెట్టిన తర్వాత కేంద్రం కూడా కాపీ కొట్టిందని నామా నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఆయన వైరా సభలో మాట్లాడుతూ... కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే ఖమ్మం ఎంపీగా లోకసభ లో చర్చించాలని పట్టుబట్టాను. పోరాడి సాధించిన తెలంగాణ అభివృద్ధిలో భాగ్యస్వామి కావాలని టీఆర్ఎస్ లోకి వచ్చాను. తెలంగాణ వస్తే చీకటి అవుతుంది అన్నారు.. కానీ 24 గంటల కరెంటు ఇస్తున్నారు కేసీఆర్. ఏ విషయంలో చూసినా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.

ఐదు ఏళ్ళ లో ఖమ్మంను అభివృద్ధి చేసుకుంటున్నాం అని నామా తెలిపారు. సీతా రామ ప్రాజెక్టు పూర్తి అయితే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కేసీఆర్ ఖమ్మంపై ప్రత్యేక దృష్టి సారించారు. అత్యధిక మెజారిటీతో ఎంపీ స్థానం గెలిచి కేసీఆర్ కు బహుమతి ఇవ్వాలి. అన్ని విభేదాలు పక్కన బెట్టాలి, మనది ఒక్కేటే గ్రూప్ .. అదే కేసీఆర్ గ్రూప్ అని పేర్కొన్నారు. అందరికి అందుబాటులో ఉంటా, ఖమ్మం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. పార్టీలలకు అతీతంగా నన్ను గెలిపించండని నామా కోరారు.