జయప్రకాశ్ నారాయణ్ కారుకు ప్రమాదం... నలుగురికి గాయాలు 

జయప్రకాశ్ నారాయణ్ కారుకు ప్రమాదం... నలుగురికి గాయాలు 

లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ప్రమాదానికి గురైంది.  ఈ ప్రమాదంలో నలుగురు మహిళలకు గాయాలయ్యాయి.  ఈ ఉదయం జయప్రకాశ్ నారాయణ్ ప్రయాణిస్తున్న కారు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద సిగ్నల్ పడటంతో ఆగింది.  వెనక నుంచి వస్తున్న ఆటో కారును బలంగా ఢీకొట్టడంతో కారు వెనుకభాగం పూర్తిగా డ్యామేజ్ అయ్యింది.  ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తులకు ఎలాంటి దెబ్బలు తాగలేదు.  

అయితే, ఆటోలో ఉన్న నలుగురు ఆడవాళ్లకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి.  ఈ సంఘటనతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద దాదాపుగా అరగంట పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది.   ప్రమాదం జరిగిన సమయంలో కారులో జే.పీ. తో పాటు వై.బీ.ఐ. అధ్యక్షుడు మారంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నారు