అందుకే మంగళగిరి నుంచి పోటీ : లోకేష్

అందుకే మంగళగిరి నుంచి పోటీ : లోకేష్

టఫ్‌ నియోజకవర్గమైనందునే మంగళగిరి నుంచి తాను బరిలోకి దిగుతున్నానని ఏపీ మంత్రి నారా లోకేష్‌ చెప్పారు. 'ఎన్టీవీ'తో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం కంచుకోటలో ఎవరైనా గెలుస్తారని అన్నారు. మంగళగిరిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్న ఆయన.. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చి పెడతానని చెప్పారు. సంక్షేమ పథకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్షాలు ఆడుతున్న డ్రామాలను ప్రజలను గమనిస్తున్నారని లోకేష్‌ అభిప్రాయపడ్డారు. టీడీపీ చేపట్టిన పథకాల గురించి ప్రజలే స్వయంగా చెబుతున్నారన్న లోకేష్‌.. ప్రభుత్వ పథకాలకు అపూర్వ స్పందన వస్తోందన్నారు.