ఆ వీడియోలు నిజమో కాదో..?: లోకేష్‌

ఆ వీడియోలు నిజమో కాదో..?: లోకేష్‌

చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్‌ అన్నారు. ఇవాళ విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ముగిసిన దాదాపు 40 రోజులకు రీపోలింగ్‌ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. రీపోలింగ్‌ నిర్వహించాలని తాము కోరినా ఈసీ స్పందించలేదన్న ఆయన.. మోడీ కమిషన్ ఆఫ్ ఇండియాలా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తోందన్నారు. పశ్చిమ బెంగాల్ లో ఒకరోజు ముందే ప్రచారాన్ని నిలిపివేయడం దేశ చరిత్రలోఎప్పుడూ జరగలేదని లోకేష్‌ అన్నారు. చంద్రగిరిలోని కొన్ని కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని ఈసీ అంటోందని.. ఆ వీడియోలు కూడా ఉన్నాయంటోంది కదా అని విలేఖరులు ప్రశ్నించగా ఈసీ విడుదల చేస్తామంటున్న వీడియోలు అసలైనవో కాదో చూడాల్సిన అవసరం ఉందన్నారు.