ప్రమాణం చేస్తావా.. జగన్‌కు లోకేష్ సవాల్ !

ప్రమాణం చేస్తావా.. జగన్‌కు లోకేష్ సవాల్ !

వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో కచ్చితంగా గుర్తించి శిక్షించాలని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ డిమాండ్‌ చేశారు. ఇది తనతో సహా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల మాట అని తేల్చి చెప్పారు. ఇందులో ఎవరికీ రెండు అభిప్రాయాలు లేవన్నారు.  వివేకా హత్య ఎవరు చేశారో నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఇది నా మాట, జగన్ మాట, షర్మిల మాట అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తమ కుటుంబానికి మరో అభిప్రాయం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు విజయమ్మ 5 పేజీల బహిరంగ లేఖ రాశారు ఈ అంశం గురించి మాట్లాడుతూ ఈ నెల 14న వెంకన్న సాక్షిగా ఈ ప్రమాణం చేయగలరా?అంటూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ చేశారు. మీరు 14న తిరుపతి వస్తున్నారని తనకు తెలిసిందని, ఐతే నేను గాని, నా కుటుంబ సభ్యులు గాని మీ బాబాయ్‌ వివేకానందరెడ్డిని చంపలేదని నేను ప్రమాణం చేస్తా. నువ్వు గాని, నీ కుటుంబ సభ్యులు గాని మీ బాబాయ్‌ని చంపలేదని ఈ నెల 14న వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయగలవా?అంటూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ చేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలో తిరుపతి ఎన్నికల ప్రచారం సందర్భంగా లోకేష్ ఈ సవాల్ చేశారు. ఈ సవాల్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ మేరకు ఒక వీడియోను కూడా తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా షేర్ చేసింది.