ఏపీ ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుతోంది

ఏపీ ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుతోంది

ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుతోందని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. ఆదివారం తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ క్లస్టర్-1 ఏర్పాటైన కార్బన్ మొబైల్స్ తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నాలుగున్నరేళ్ల క్రితం మొబైల్ తయారీలో ఏపీ వాటా సున్నా.. కాని ప్రస్తుతం ఏ మొబైల్ చూసిన మేడ్ ఇన్ ఏపీ కనిపిస్తుందని కొనియాడారు. ఈ ప్రాంతాన్ని సిలికాన్ సిటీగా మార్చడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు రూ.15వేల కోట్లతో 8వేల మందికి ఉపాధి కల్పించనున్నామని తెలిపారు. మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డితో కలిసి నారా లోకేష్ ఆదివారం మరో 10 ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా టాటా గ్రూప్ కంపెనీల్లో ఒకటైన వోల్టాస్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కాబోతుందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు.