వారు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు: లోకేష్‌

వారు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు: లోకేష్‌

యువత రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యమని ఏపీ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. విశాఖపట్నంలో విద్యార్థులతో ఇవాళ ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి 2019 ఎన్నికలు చాలా కీలకం అని అన్నారు. ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీ అభివృద్ధి జరుగుతుందన్న ఆయన.. దేశంలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష అని చెప్పారు. ఐదేళ్లలోనే ఈ స్థాయిలో అభివృద్ధి జరిగిందంటూ మరో ఐదేళ్లు మరింత అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో యువతకు పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు వచ్చాయని లోకేష్‌ అన్నారు. స్టార్టప్ కంపెనీలు స్థాపించే దిశగా యువత ఎదగాలని లోకేష్‌ ఆకాంక్షించారు.