'మా సహనాన్ని పరీక్షించొద్దు..'

'మా సహనాన్ని పరీక్షించొద్దు..'

'గుంటూరు జిల్లాలో టీడీపీకి ఓటేశారని రైతులను ఐదేళ్లు గ్రామ బహిష్కరణ చేశారు. నెల్లూరులో పేదల గుడిసెలు కూల్చడానికి ప్రయత్నించారు. మా కార్యకర్తలపై 100కు పైగా దాడులు చేశారు. ఇదేనా.. మీరు చెప్పిన రాజన్న రాజ్యం?' అని ప్రశ్నించారు టీడీపీ నేత నారా లోకేష్‌. ఈమేరకు ఇవాళ ఆయన వరుస ట్వీట్లు చేశారు. దాడులు, దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దని అన్నారు. గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్ప అరాచకాలకు మార్గం కాకూడదన్న లోకేష్‌.. పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.