ఆళ్ల రామకృష్ణారెడ్డికి లోకేష్ అభినందనలు

ఆళ్ల రామకృష్ణారెడ్డికి లోకేష్ అభినందనలు

మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యద‌ర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌బాబు అభినందనలు తెలియజేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై అత్యంత విశ్వాసంతో ఓట్లు వేసిన ప్రజలందరికి నమస్కారాలు. నామినేష‌న్ వేసిన నాటినుంచి కౌంటింగ్ వ‌ర‌కు అహ‌ర్నిశ‌లు తన కోసం శ్రమించిన తెలుగుదేశం పార్టీ నాయ‌కులకు, కార్యక‌ర్తలకు కృత‌జ్ఞత‌లు. తొలిసారి ఎన్నిక‌ల‌లో పోటీచేసిన తనకు మ‌ద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి పేరుపేరునా ధ‌న్యవాదాలు. మీడియా మిత్రుల స‌హ‌కారం మ‌రువ‌లేనిది. ఎన్నిక ప్రక్రియ‌ ప్రశాంతంగా సాగేందుకు స‌హ‌క‌రించి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లు అందరూ ఆద‌ర్శంగా నిలిచారు. నియోజ‌క‌వ‌ర్గ పార్టీ నాయ‌కులకు, కార్యక‌ర్తల‌కు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. మంగ‌ళ‌గిరి అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తా. ప్రజ‌ల్లో ఉంటూ ప్రజాస‌మ‌స్యల‌పై పోరాడ‌తాను అని లోకేష్ అన్నారు.