మయావతి-ములాయం: పాతికేళ్ల తర్వాత ఒకే వేదికపై.. 

మయావతి-ములాయం: పాతికేళ్ల తర్వాత ఒకే వేదికపై.. 

సమాజ్‌‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌.. బీఎస్పీ చీఫ్ మాయావతి.. ఈ ఇద్దరి అగ్రనేతల మధ్య రెండు దశాబ్ధాలకు పైగా మాటల్లేవు.  1995 నుంచి వీరు కలిసిన సందర్భాలు కూడా లేవు. కానీ.. బీజేపీకి ఢికొట్టేందుకు వీరిద్దరూ చేతులు కలిపారు. మిత్రులుగా మారి  గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పాతికేళ్ల తర్వాత ఇద్దరూ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. 

బీజేపీకి మట్టికరిపించేందుకు ఆర్‌ఎల్డీతోకలిసి మహాకూటమి కట్టిన ఎప్పీ, బీఎస్పీలు.. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈనెల 23న జరిగే మూడో విడత ఎన్నికల్లో యూపిలో 10 స్థానాల్లో పోలింగ్‌ జరగబోతోంది. ఎస్పీ కంచుకోటైన మెయిన్‌పురిలో కూడా ఈ ఫేజ్‌లోనే ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పక్షాలూ.. ఇవాళ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాయి. ఈ ర్యాలీకి  ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్, మాయావతిలు హాజరవుతున్నారు. ఆర్‌ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ సైతం పాల్గొంటారు.

1993లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేయగా.. సమాజ్‌వాదీ పార్టీ 109, బీఎస్సీ 67 స్థానాల్లో గెలిచాయి. 177 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎస్పీ-బీఎస్పీ పార్టీలు మరికొన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఈ క్రమంలో ఎస్పీ-బీఎస్పీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నరు. దాడి నుంచి తప్పించుకునేందుకు మాయావతి ఓ గదిలోకి వెళ్లి తలుపువేసుకున్నారు. సంచలనం రేపిన ఈ ఘటన తర్వాత ఇరుపార్టీలు ఎడముఖం పెడముఖంగానే ఉన్నాయి. మళ్లీ ఇన్నాళ్లకు జతకట్టి బీజేపీని ఢికొడుతున్నాయి.