బ్రిటన్ లో ఆసియా కుబేరులు హిందుజాలు

బ్రిటన్ లో ఆసియా కుబేరులు హిందుజాలు

లండన్ లో నివసించే దిగ్గజ ఎన్నారై పారిశ్రామికవేత్త హిందూజా కుటుంబం ఈ ఏడాది వరుసగా ఆరోసారి 'ఏషియన్ రిచ్ లిస్ట్'లో అగ్రస్థానాన్ని సాధించింది. వీళ్ల మొత్తం సంపద 25.2 బిలియన్ పౌండ్లు. గత ఏడాదితో పోలిస్తే వీళ్ల సంపత్తి 3 బిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ పెరిగింది. లండన్ లో శుక్రవారం రాత్రి ఏషియన్ బిజినెస్ అవార్డ్స్ సందర్భంగా జారీ చేసిన 'ఏషియన్ రిచ్ లిస్ట్ 2019' ప్రకారం స్టీల్ కింగ్ లక్ష్మీ మిట్టల్, ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్ రెండో స్థానంలో నిలిచారు. వీళ్ల మొత్తం సంపత్తి 11.2 బిలియన్ పౌండ్లు. ఇందులో గత ఏడాదితో పోలిస్తే 2.8 పౌండ్ల తగ్గుదల కనిపించింది.

బ్రిటన్ లో భారత హైకమిషనర్ యుకె రుచి ఘనశ్యామ్ జాబితా విడుదల చేశారు. ఇందులో బ్రిటన్ లో నివసించే ఆసియాకి చెందిన మొత్తం 101 మంది బిలియనీర్ల ర్యాంకింగులు, గత 12 నెలల్లో వ్యాపార రంగంలో వారి విజయాలను ప్రచురించారు.

ఈ జాబితాలో ఎస్పీ లోహియా 5.8 బిలియన్ పౌండ్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు. ఏషియన్ రిచ్ లిస్ట్ 2019లో ఉన్న వ్యాపారవేత్తల మొత్తం సంపద 85.2 బిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ. ఈ బిలియనీర్ల మొత్తం సంపత్తి ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఇది 5 బిలియన్ పౌండ్ల వృద్ధి చెందింది. 

జాబితాలో ఏడుగురు కొత్త బిలియనీర్లు చేరారు. వీళ్లలో హోటల్ వ్యాపారవేత్త జోగిందర్ సెంగర్, ఆయన కుమారుడు గిరీష్ సెంగర్ కూడా ఉన్నారు. వీళ్లు 40వ స్థానంలో నిలిచారు. వీళ్ల మొత్తం సంపద సుమారుగా 30 కోట్ల పౌండ్ల కంటే ఎక్కువ. 

జాబితాలోని దిగ్గజ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ అండ్ ఫ్యామిలీ 17వ స్థానంలో ఉంది. వీళ్ల మొత్తం ఆస్తులు 90 కోట్ల పౌండ్లు. వీళ్ల సంపద గత ఏడాదితో పోలిస్తే 10 కోట్ల పౌండ్లు పెరిగింది.