ఈ గుర్రం టీ తాగందే కాలు కదపదు 

ఈ గుర్రం టీ తాగందే కాలు కదపదు 

మాములుగా మనిషికి ఉదయం లేచిన వెంటనే టీ, లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది.  టీ లేదా కాఫీ తగిన తరువాతగాని మిగతా పనులు చేయలేరు.  మనుషులకు ఎలాగైతే ఇలాంటి అలవాట్లు ఉన్నాయో... అటు జంతువులకు కూడా వాటికీ సంబంధించి కొన్ని అలవాట్లు ఉంటాయి.  అలా కాకూండా వాటికీ మనం కొన్ని కొత్తగా అలవాట్లు చేస్తే వాటికి అలవాటు పడతాయి.  ఆ పద్దతిలోనే నడుచుకుంటాయి.  

లండన్ లోని మెర్సిసైడ్ పోలీస్ వద్ద జాక్ అనే గుర్రం ఉన్నది.  గత 15 సంవత్సరాలుగా అది సేవలు అందిస్తోంది.  ఈ గుర్రానికి దాని ట్రైనర్ ఉదయాన్నే లేచేందుకు టీని అలవాటు చేశారు.  దీంతో ఇపుడు దానికి టీ బాగా అలవాటైంది. ఉదయం టీ ముందుపెడితేనే నిద్రలేస్తున్నది.  శుభ్రంగా రెండు కప్పుల టీ తాగేసి ఆ తరువాత యాక్టివ్ గా రంగంలోకి దిగుతుంది.  ఇక్కడ  విషయం ఏమంటే.. ఉదయం లేచే సమయంలో టీ ఎలాగైతే ఇస్తారో రాత్రి పడుకునే సమయంలో కూడా దానికి ఓ కప్పు ఇవ్వాలట.  అలా ఇస్తేనే అది నిద్రపోతుంది. ఇప్పుడు ఈ గుర్రానికి సంబంధించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.