20 నుంచి లారీల బంద్ 

20 నుంచి లారీల బంద్ 

లారీల యజమానులు మళ్లీ నిరవధిక సమ్మెకు రెడీ కాబోతున్నారు.  డీజిల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని.. దేశవ్యాప్తంగా ఒకే ధరను నిర్ణయించి, ప్రతి 3 నెలలకోసారి ధరలను సవరించాలన్న డిమాండ్ల సాధనకు ఈ నెల 20నుంచి సమ్మె చేపడుతున్నట్లు 'ఆల్‌ ఇండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ)'  పిలుపునిచ్చింది. దీంతో తాము కూడా రాష్ట్రం నుంచి సమ్మెకు దిగుతున్నట్లు తెలంగాణ లారీ యజమానుల సంఘం తెలిపింది.  
తెలంగాణలోని లారీ యజమానుల సమ్మెతో రాష్ట్రంలో మొత్తం 1.75 లక్షల లారీలు, వ్యాన్లు, మినీ వ్యాన్ల వంటి రవాణావాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. గతంలో రెండుసార్లు సమ్మెచేపట్టి సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా.. ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. ఈ సారి చేపట్టనున్న సమ్మెతో... ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోనున్నాయని తెలిపారు తెలంగాణ లారీ యజమానుల సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌, అధ్యక్షుడు ఎన్‌.భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్‌.