స్కూల్‌ బస్సుపైకి దూసుకొచ్చిన లారీ..

స్కూల్‌ బస్సుపైకి దూసుకొచ్చిన లారీ..

హైదరాబాద్‌లోని ఖాజాగూడ చౌరస్తాలో లారీ బీభత్సం సృష్టించింది. ఇటుక లోడుతో వెళ్తున్న లారీ అతివేగంగా ప్రయాణిస్తూ ఓ స్కూల్‌ బస్సుపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో స్కూల్‌ బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శంకర్మట్ డీడీ కాలనీ నుంచి విద్యార్థులను తెచ్చేందుకు వెళ్తున్న స్కూలు బస్సు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ బ్రేక్‌లు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం.