అదుపుతప్పి రెయిలింగ్ పైకి దూసుకెళ్లిన లారీ

అదుపుతప్పి రెయిలింగ్ పైకి దూసుకెళ్లిన లారీ

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కైగల్‌ వంతెనపై ఓ కంటెయినర్‌ లారీ అదుపుతప్పి రెయిలింగ్‌పైకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ కంటెయినర్‌ వంతెన రెయిలింగ్‌ను ఢీకొని ఆగిపోవడంతో డైవర్‌, అతని సహాయకుడు ప్రాణాలతో బయటపడ్డారు. వంతెనపై ప్రమాదకరంగా వేలాడుతూ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. ఈ ఘటనతో పలమనేరు-కుప్పం రహదారిపై రెండుకిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. సుమారు ఐదు గంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని లారీని వంతెనపై నుంచి తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.