లారీల సమ్మె.. నాలుగో రోజు

లారీల సమ్మె.. నాలుగో రోజు

తమ డిమాండ్ల సాధన కోసం ఆల్ ఇండియా మోటర్ ట్రాన్స్ పోర్ట్ కాంగ్రెస్ పిలుపు మేరకు దేశవ్యాప్త లారీ సమ్మె నాలుగవ రోజుకు చేరుకుంది. డీజిల్‌ను జీఎస్టీలోకి చేర్చాలన్న ప్రధాన డిమాండ్‌తో దేశవ్యాప్తంగా లారీల యజమానులు సమ్మె చేస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సరకు రవాణా నిలిచిపోవడంతో ఆ ప్రభావం చూపించిండం ప్రారంభమయింది. మరో రెండు రోజుల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ రవాణాను కూడా నిలిపివేయాలని లారీల యజమానుల  సంఘం నిర్ణయించారని తెలుస్తోంది.