అమీర్ ముక్కుపుడక కథ

అమీర్ ముక్కుపుడక కథ

బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరొందాడు. సినిమాలో తన పాత్రలోని పరకాయ ప్రవేశం చేయడం మాత్రమే కాదు, అందుకు తగినట్టుగా తన లుక్స్ ని కూడా మార్చేసుకుంటాడు ఆమిర్. అందుకోసం ఎంత కష్టమైనా పడతాడు. విడుదలకు సిద్ధమైన థగ్స్ ఆఫ్ హిందోస్థాన్ లో ఆమిర్ ముక్కుపుడక పెట్టుకొని కనిపించనున్నాడు ఆమిర్ ఖాన్. ఫిరంగీ పాత్రకు ఆ ముక్కెర తప్పనిసరి అని భావించి తనే డిజైన్ చేశానని చెప్పాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.

రెండో తరగతి చదివేటపుడు తన క్లాసులో ఒక అబ్బాయి ముక్కుపుడక పెట్టుకొచ్చేవాడని గుర్తు చేసుకొన్న ఆమిర్, సింధ్ ప్రాంతంలో ఉండేవాళ్లు అలా ధరిస్తారని తెలుసుకున్నాడు. కానీ ఆ విషయం ఆమిర్ మనసులో అలా నాటుకుపోయింది. థగ్స్ స్క్రిప్ట్ విన్నపుడు ఫిరంగీ కేరక్టర్ కి ముక్కెర ఉంటే బాగుంటుందని భావించాడు ఆమిర్. తన పాత మిత్రుడిని పిలిచి ఆ ముక్కుపుడక గురించి అడిగాడు. ఎంత వెదికినా ఆ ముక్కెర కానీ దాని ఫోటో అయినా దొరకలేదు. దీంతో తనకు గుర్తున్న మేరకు అది పచ్చలు, కెంపులు పొదిగిన పువ్వు మాదిరిగా డిజైన్ చేసి తయారు చేయించాడు.

థగ్స్ ఆఫ్ హిందోస్థాన్ నవంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.