ప్రేమ జంట ఆత్మహత్య..

ప్రేమ జంట ఆత్మహత్య..

కొమురం భీం అసిపాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని గొయేగాం గ్రామంలో ప్రేమ జంట అత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన కుర్సంగే గౌరుబాయి (18), అదే గ్రామానికి చెందిన మెడ్పచి భరత్ (22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. కానీ, తన తల్లి మందలించిందనీ  శుక్రవారం రాత్రి గౌరుబాయి పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు తీవ్రంగా కుంగిపోయాడు.. ఆమె తన ప్రేమ కోసం చనిపోయిందని ఆమె లేనిది నేనెలా ఉండాలంటూ అబ్బాయి కూడా పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రేమ జంటది ఒకే కులమైనా పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు.