వరంగల్‌లో ప్రేమ జంట ఆత్మహత్య.. చేతులు కట్టేసుకొని బావిలో దూకి..!

వరంగల్‌లో ప్రేమ జంట ఆత్మహత్య.. చేతులు కట్టేసుకొని బావిలో దూకి..!

తెలంగాణలో ఈ మధ్యే వరుసగా ప్రేమ జంటలు మృతిచెందుతున్నాయి.. పెళ్లి చేసుకున్న మరునాడే రోడ్డు ప్రమాదంలో ఓ ప్రేమ జంట మృతిచెందగా.. తాజాగా.. ఇష్టంలేని పెళ్లి చేసుకున్నారని వేధింపులు ఎక్కువ కావడంతో.. మరో యువ జంట ఆత్మహత్యాయత్నం చేసింది.. భర్త మృతిచెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇక, ఇవాళ మరో ఆత్మహత్య ఘటన వెలుగు చూసింది... వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. నక్కలపల్లి గ్రామంలో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.. మొదట బావి దగ్గర ఓ బైక్, చెప్పులు, రెండు సెల్‌ఫోన్లు కనిపించడంతో.. ఆత్మహత్య చేసుకున్నారని భావించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఆ బావి దగ్గరకు పోలీసులు చేరుకుని.. స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.. దీంతో.. బావిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.. ఆ ప్రేమ జంట రెండు చేతు తాళ్లతో కట్టేసుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు.. మృతులు నక్కలపెల్లికి చెందిన మన్నే సాయి.. అశ్వినీగా గుర్తించారు.. ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.. ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుంది? అనే విషయాలను తేల్చేపనిలో ఉన్నారు పోలీసులు.