సెల్ఫీ వీడియో తీసుకుని ప్రేమ జంట ఆత్మహత్య !

సెల్ఫీ వీడియో తీసుకుని ప్రేమ జంట ఆత్మహత్య !

 

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మొరవపల్లిలో ఈరోజు ఉదయం ఒక ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.  చంద్రగిరి మండలం మొరవపల్లెకి చెందిన ధనంజయ, శ్రీకాళహస్తికి చెందిన పల్లవిలు  గత సంవత్సరంగా  ప్రేమించుకుంటున్నారు. ధనంజయ  స్థానికంగా జెసిబి  డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.  మూడు రోజుల క్రితం వీరు తమ ప్రేమను తల్లిదండ్రులకు తెలియజేసి వివాహం చేయమన్నారు. అయితే పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చి వివాహం చేసుకున్నారు.  అనంతరం తమ చావు అందరికీ ఉదాహరణ కావాలంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆ తరవాత ఆత్మహత్య చేసుకున్నారు.