వారం ఎడబాటును కూడా తట్టుకోలేని ప్రేమ..

వారం ఎడబాటును కూడా తట్టుకోలేని ప్రేమ..

ప్రేమంటే ఏంటి? ఎడబాటును ఎంతమాత్రం భరించలేనిదే ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలనుందా? కింద ఎంబెడ్ చేసిన ట్విట్టర్ పోస్టింగ్ ను క్లిక్ చేసి చూడండి. 

88 ఏళ్ల తండ్రి.. 53 ఏళ్ల కొడుకు మధ్య ఎంత గాఢమైన ప్రేమానుబంధం పెనవేసుకుందో చూసి తీరాల్సిందే. కొడుకు అందరికన్నా భిన్నంగా.. ఆ వయసులో ఉండే సహజమైన ప్రవర్తనకు భిన్నంగా.. అచ్చమైన పసిపిల్లాడిలా తండ్రితో ఎంత గారాం చేస్తున్నాడో చూడిండి. దాన్ని మెచ్యూరిటీ లేని ప్రవర్తనగా కొట్టిపారేద్దామా? లేక అంతటి అమలిన ప్రేమను పంచుకోలేకపోతున్నందుకు ఎవరికి వారే జాలిపడదామా? తేల్చుకోవాల్సింది ఎవరికి వారే.