విద్వేషానికి ఓటమి.. ప్రేమదే విజయం-రాహుల్‌ గాంధీ

విద్వేషానికి ఓటమి.. ప్రేమదే విజయం-రాహుల్‌ గాంధీ

సార్వత్రిక ఎన్నికల్లో విద్వేషం ఓడిపోతుంది... ప్రేమ విజయం సాధిస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... ఆరో విడత ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో పోలింగ్‌ కొనసాగుతుండగా... ఢిల్లీలోని ఔరంగజేబ్‌ లేన్‌లోని ఎన్‌పీ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు రాహుల్... ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో పేరుకుపోయిన ప్రధాన సమస్యలపై ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. నిరుద్యోగం, రైతుల సమస్యలు, నోట్లరద్దు, రఫేల్‌ స్కామ్ తదితర అంశాలపై ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారన్న కాంగ్రెస్ చీఫ్.. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ విద్వేషాన్నే ఆయుధంగా చేసుకుని ప్రచారం చేశారని... కానీ, మేం ప్రేమతోనే ముందుకువెళ్లాం. ద్వేషంపై ప్రేమే విజయం సాధిస్తుందని తాను నేను నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ.